ఆహ్వానం ఉన్న వారికి మాత్రమే అనుమతి

మార్చి 4న విజయ్‌ దేవరకొండ - రష్మిక వివాహ రిసెప్షన్ జరగనుంది.

Update: 2026-03-02 04:06 GMT

మార్చి 4వ తేదీన విజయ్‌ దేవరకొండ - రష్మిక వివాహ రిసెప్షన్ జరగనుంది. హైదరాబాద్‌ పోలీసుల ఆంక్షల నేపథ్యంలో అభిమానులకు విజయ్ దేవరకొండ - రష్మిక రిక్వెస్ట్ చేశారు. ఆహ్వానం లేనివాళ్లు వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు. ఆహ్వానం ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని, అందరూ వచ్చిఇబ్బంది పెట్టవద్దని తెలిపారు.

వచ్చి ఇబ్బంది పడవద్దంటూ...
గత నెల 26వ తేదీన విజయ్ దేవరకొండ - రష్మిక వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన సంగతి తెలిసిందే. వారి వివాహ రిసెప్షన్ ను ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానులు ఎవరూ రిసెప్షన్ కు రావద్దని వారు సూచించారు.


Tags:    

Similar News