కేరళ స్టోరీ - 2 సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
కేరళ స్టోరీ - 2 సినిమా విడుదలకు హైకోర్టుగ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
కేరళ స్టోరీ - 2 సినిమా విడుదలకు హైకోర్టుగ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలపై ఉన్న స్టే ను కేరళ హైకోర్టు ఎత్తివేసింది. సినిమాలో వివాదాస్పద వ్యాఖ్యలున్నాయంటూ, అసలు సినిమా చూడకుండా అనుమతి ఎలా ఇచ్చారంటూ ఇటీవల న్యాయస్థానం సెన్సార్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ చేసిన తర్వాత కేరళ స్టోరీ 2 విడుదలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సిద్ధం చేసిన నిర్మాతలు...
తాజాగా ఈ స్టేను ఎత్తివేయడంతో చిత్ర బృందం కేరళ స్టోరీ - 2 సినిమా విడుదలకు అంతా సిద్ధం చేసుకుంటుంది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ 2023లో విడుదలయింది. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. దానికి సీక్వెల్ గానే కేరళ స్టోరీ - 2 సినిమా రూపుదిద్దుకుంది. ఫిబ్రవరి 27వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. తాజాగా కేరళ హైకోర్టు ఆదేశాలతో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగినట్లే.