మెగా స్టార్ చిరంజీవికి సింగర్ చిన్మయ్ కౌంటర్

మెగా స్టార్ చిరంజీవికి సింగర్ చిన్మయ్ కౌంటర్ ఇచ్చారు

Update: 2026-01-27 06:15 GMT

మెగా స్టార్ చిరంజీవికి సింగర్ చిన్మయ్ కౌంటర్ ఇచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదన్న మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలను విభేదించిన సింగర్ చిన్మయి ఫిల్మ్ ఇండస్ట్రీ మిర్రర్ లాంటిదని అన్నారు. మహిళలు తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీస్ లోకి రావాలని, యువతులు పనిచేసే చోట ధైర్యంగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని చిరంజీవి అన్నారు. టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ లేదని చిరంజీవి అన్నారు.

పనికి బదులు సెక్స్ ను...
అయితే సింగర్ చిన్మయ్ మాత్రం కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అని అన్నారు. సినిమాల్లో అవకాశాలకు కమిట్మెంట్‌కు నో చెబితే ఇవ్వరంటూ చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి జనరేషన్‌లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారని, ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది కాదు.. లిరిక్ రైటర్ వైరముత్తు తనను వేధించాడని, ఇక్కడ పనికి బదులుగా సెక్స్ కోరుకుంటారని చిన్మయి తెలిపారు.


Tags:    

Similar News