మన శంకర వరప్రసాద్ గారు మూవీ సెకండ్ డే కలెక్షన్ వింటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ రెండో రోజు కూడా భారీ కలెక్షన్లు వసూలు చేసింది
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ రెండో రోజు కూడా భారీ కలెక్షన్లు వసూలు చేసింది. చిరంజీవి నటించిన ఈ మూవీ సంక్రాంతి పండగకు విడుదలయి బ్లాక్ బస్టర్ గా నిలవడంతో మెగా అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నెల 12వ తేదీన మన శంకర వరప్రసాద్ గారు మూవీ విడుదలయింది.
120 కోట్లు...
రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కేవలం 48 గంటల్లోనే 120 కోట్లు వసూలు చేసిందని మన శంకర వరప్రసాద్ గారు మూవీ టీం పోస్టర్ ను విడుదల చేసింది. ఆదివారం వరకూ ఇదే వసూళ్లు కొనసాగితే చిరంజీవి గత రికార్డులను తానే బ్రేక్ చేసే అవకాశాలున్నాయి.