మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ డే కలెక్షన్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ డే కలెక్షన్స్ అధికారికంగా మేకర్స్ విడుదల చేశారు

Update: 2026-01-13 05:08 GMT

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ డే కలెక్షన్స్ అధికారికంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీన ఈ మూవీ విడుదలయింది. ప్రీమియర్స్ నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి రోజు మంచి కలెక్షన్ ను తెచ్చిపెట్టింది. ప్రీమియర్స్ తో కలిపి తొలి రోజు మన శంకర వరప్రసాద్ మూవీకి 84 కోట్ల రూపాయలు వసూలయినట్లు షైన్ స్క్రీన్స్ వెల్లడించింది.

తొలిరోజు ఎంతంటే...?
మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేశారంటూ పోస్టర్ ను విడుదల చేసింది. చిరంజీవి సరసన నయనతార ఈ మూవీలో నటించింది. అలాగే ముఖ్య అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. తొలి రోజు 82 కోట్ల రూపాయలు వసూలు చేయడంతో పండగ సీజన్ ముగిసే సమయానికి మన శంకర వరప్రసాద్ గారు సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశముందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News