ప్రధానిని కలిసిన విజయ్, రష్మిక

టాలీవుడ్ కొత్త జంట విజయ్, రష్మిక దంపతులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు

Update: 2026-02-27 08:12 GMT

టాలీవుడ్ కొత్త జంట విజయ్, రష్మిక దంపతులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. నిన్న రాజస్థాన్ లోని ఉదయ పూర్ లో ఇద్దరూ ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుకను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న నూతన దంపతులు ప్రధాని నరేంద్రమోదీని తమ వివాహ రిసెప్షన్ కు హాజరు కావాలని కోరారు. వచ్చే నెల 4న వీరి రిసెప్షన్ హైదరాబాద్ లో ఉంది.

రిసెప్షన్‌కు రావాలని...
మార్చి 4న జరగనున్న తమ వివాహ రిసెప్షన్‌కు రావాలని ప్రధానిని ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ వారి వినతిని మన్నించారని చెబుతున్నారు. ప్రధాని నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇద్దరితో కాసేపు మాట్లాడారు. వారితో కలసి కాసేపు గడిపారు. న్యూ లీ మారీడ్ కపుల్ ప్రధాని మోదీని శాలువతో సత్కరించారు.


Tags:    

Similar News