వేడుకగా హీరో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మంథన వివాహం జరిగింది
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మంథన వివాహం జరిగింది. ఈరోజు ఉదయం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వివాహం జరిగింది. విజయ్ దేవర కొండ రష్మికలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దీంతో పెద్దయెత్తున ఇద్దరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విజయ్ , రష్మికల వివాహం రెండు కుటుంబాల సంప్రదాయం ప్రకారం జరిగిందని చెబుతున్నారు. ఉదయం విజయ్ వైపు నుంచి హిందూ సంప్రదాయంలో వివాహం జరిగింది.
4న హైదరాబాద్ లో రిసెప్షన్...
సాయంత్రం రష్మిక కుటుంబ సంప్రదాయం మేరకు వివాహం జరుగుతున్నట్లు చుప్పారు. ఈ వివాహానికి కొందరు ప్రత్యేక అతిధులు మాత్రమే హాజరయ్యారు.బాలీవుడ్, టాలీవుడ్ రంగానికి చెందిన ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారని తెలిసింది. అలాగే బుధవారం హల్దీ వేడుకను నిర్వహించినట్లు విరోష్ జోడీ స్పష్టం చేసింది. వివాహ రిసెప్షన్ మార్చి 4వ తేదీన హైదరాబాద్ లో జరగనుంది.