జోర్డాన్ లో 'డ్రాగన్' షూట్ లో ఎన్టీఆర్

జోర్డాన్‌లో షూటింగ్ జరుపుతున్న జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' చిత్ర యూనిట్‌కు పెను ప్రమాదం తప్పింది

Update: 2026-03-02 02:51 GMT

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, జోర్డాన్‌లో షూటింగ్ జరుపుతున్న జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' చిత్ర యూనిట్‌కు పెను ప్రమాదం తప్పింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో జోర్డాన్ గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ముందుచూపుతో, ఫిబ్రవరి 22నే షూటింగ్ పూర్తి చేసుకుని టీమ్ భారత్ తిరుగు ప్రయాణమయ్యారు.

ముందుగానే రావడంతో...
దీంతో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు డ్రాగన్ చిత్ర యూనిట్ ప్రమాదం నుంచి బయటపడింది. ఒకవేళ షూటింగ్ మరికొన్ని రోజులు ఆలస్యమైతే, ఎన్టీఆర్‌తో పాటు వందలాది మంది చిత్ర యూనిట్ అక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉండేదని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ముందుగానే షూట్ చేసుకుని ఇండియాకు చేరుకోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు.


Tags:    

Similar News