రామ్ చరణ్ పిల్లల పేర్లవే
మెగా గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తన కవల పిల్లల పేర్లను వెల్లడించారు
మెగా గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తన కవల పిల్లల పేర్లను వెల్లడించారు. అబ్బాయి పేరు శివరామ్ అని, అమ్మాయి పేరు అన్విరా దేవి అని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ ఈ విషయాన్ని పంచుకున్నారు. జనవరి 31న ఉపాసన-రామ్‌చరణ్ దంపతులకు కవలలు జన్మించిన విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి ఇంట ఆనందం వెల్లివిరిసింది.
గత నెల 31న జన్మించిన...
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇప్పటికే క్లింకార కుమార్తె ఉంది. గత నెల 31న కవల పిల్లలు జన్మించడం, మగ, ఆడశిశువు ఉండటంతో చిరంజీవి అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా పేర్లు కూడా వెల్లడించారు. తమ కుటుంబానికి వారసుడు రావడంతో మెగా కుటుంబంలో ఆనందం మరింత రెట్టింపు అయింది.