జననాయగన్ సినిమాకు తప్పని చిక్కులు
విజయ్ నటించిన జననాయగన్ సినిమాకు చిక్కులు తప్పడం లేదు
విజయ్ నటించిన జననాయగన్ సినిమాకు చిక్కులు తప్పడం లేదు. మద్రాస్ హైకోర్టు జనగాయన్ సినిమా విడుదలపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ కే వెళ్లాలని తెలిపింది. గతంలో సింగిల్ బెంచ్ జననాయగన్ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇవ్వాలని మద్రాస్ సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది. అయితే సెన్సార్ బోర్డు దీనిపై అభ్యంతరం చెబుతూ, సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించింది.
న్యాయస్థానం తీర్పుతో...
టీవీకే అధినేత విజయ్ నటించిన సినిమా జనగాయన్ కు విడుదల కష్టాలు తప్పడం లేదు. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉండగా అక్కడి నుంచి క్లియరెన్స్ రాలేదు. అయితే సింగిల్ బెంచ్ తీర్పు U/A సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పినా విడుదల కాలేదు. విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా తిరిగి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని తెలిపింది. దీంతో విజయ్ నటించిన జననాయగన్ మూవీ విడుదల ఇప్పట్లో లేనట్లే.