సినిమా వాళ్ళకి వెంకయ్య నాయుడు క్లాస్.. ఇండస్ట్రీలో నేపోటిజం..

సినిమాల్లో అశ్లీల సన్నివేశాలు, బూతు డైలాగ్స్ పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కామెంట్స్. అలాగే ఇండస్ట్రీలో నేపోటిజం గురించి..

Update: 2023-09-21 07:35 GMT

ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో అశ్లీల సన్నివేశాలు, బూతు డైలాగ్స్ ఎక్కువ అవుతూ వస్తున్నాయి. వీటి పై విమర్శలు వస్తున్నప్పటికీ, మేకర్స్ చెబుతున్న మాట.. ఆ సీన్ పండాలంటే అవి అవసరం కాబట్టే పెట్టాల్సి వస్తుందని. ఇక తాజాగా ఇలాంటి సన్నివేశాల గురించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కూడా స్పదించారు. రీసెంట్ గా ఈయన ‘అక్కినేని నాగేశ్వరరావు’ (Akkineni Nageswara Rao) శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

అక్కడ ఆయన మాట్లాడుతూ.. "సినిమా అనేది ప్రజలకు చాలా దగ్గరగా ఉండేది. రాజకీయాలు కంటే సినిమాలు ప్రజలు పై ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటాయి. అలాంటి సినిమాలు తీసేటప్పుడు మేకర్స్ కొంచెం జాగ్రత్త వహించాలని కోరుతున్నాను. నాగేశ్వరరావు గారు ఆయన చిత్రాలతో సంప్రదాయాలు, విలువలను ఆడియన్స్ కి తెలియజేసేలా చేశారు. ఆయన ప్రతి సినిమాలో ఏదొక మెసేజ్ లేదా విద్యతో కూడిన సన్నివేశాలు ఉండేవి. అవి యువత పై ప్రభావం చూపేవి. కానీ ఇప్పుడు సినిమాలు యువతని తప్పు దారి పట్టించేలా ఉన్నాయి.
అశ్లీల సన్నివేశాలు, డబల్ మీనింగ్ డైలాగ్స్ తో సినిమాలోని సన్నివేశాలను నడిపిస్తున్నారు. అక్కడ అటువంటి సన్నివేశాలు లేకున్నా ఆ సీన్ పండించే మార్గం ఉంటుంది. కానీ ఇప్పటి మేకర్స్ కి అది అర్ధం కావడం లేదు. సినిమా అనేది పాస్ట్ కి ఫ్యూచర్ కి ఒక బ్రిడ్జి లాంటిది. అలాంటి ఒక మాధ్యమం ద్వారా మంచి చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పటి నిర్మాతలు, దర్శకులు, పాటలు రచయితలు కొంచెం భాద్యతగా వ్యవహరించాలని కోరుతున్నాను" అంటూ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
ఇక సినిమా రంగంలో వారసత్వం గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లో తాను వారసత్వానికి వ్యతిరేకం అని, కానీ సినిమా రంగంలో మాత్రం దానిని సపోర్ట్ చేస్తానని పేర్కొన్నారు. ఎందుకంటే, పాలిటిక్స్ లో వారసుడు ఎటువంటి కష్టం లేకుండా నిలబడవచ్చు. కానీ సినిమా రంగంలో వారసుడు నిలబడడానికి ఒక కళాకారుడిగా తనని తాను నిరూపించుకోవాలి, లేకుంటే ఇక్కడ రాణించడం కష్టం అంటూ వెల్లడించారు.


Tags:    

Similar News