Gaddar Awards : మెగాస్టార్ కు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు
2025 గద్దర్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది
2025 గద్దర్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు వచ్చింది. కమల్ హాసన్ కు పైడి జయరాజ్ అవార్డు, ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు లభించింది. జయసుధకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు దక్కిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ఉత్తమ నటుడిగా నాగ చైతన్య...
ఉత్తమ నటుడిగా నాగ చైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక, మార్చి 19వ తేదీన ఉగాది సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. 2025 అవార్డుల కోసం ప్రభుత్వం నియమించిన జ్యూరీ ఈ అవార్డులకు ఎంపిక చేసింది. మెగాస్టార్ కు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు లభించింది.
గద్దర్ ప్రధాన చిత్ర అవార్డులు 2025:
ఉత్తమ చిత్రం : రాజు వెడ్స్ రంభాయి
రెండవ ఉత్తమ చిత్రం: దండోరా
మూడవ ఉత్తమ చిత్రం: వెడ్డింగ్ ఫోటోగ్రఫీ
నటనా విభాగం:
ఉత్తమ నటుడు: నాగచైతన్య (తండేల్)
ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
గౌరవ పురస్కారాలు :
ఎన్టీఆర్ అవార్డు: మెగాస్టార్ చిరంజీవి
ఏఎన్నార్ అవార్డు: జయసుధ
కాంతారావు అవార్డు: ఆర్. నారాయణమూర్తి
బి.ఎన్. రెడ్డి అవార్డు: సింగీతం శ్రీనివాసరావు