నటి దేవీప్రియ కారుకు ప్రమాదం
ప్రముఖ బుల్లితెర నటి దేవిప్రియ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది
ప్రముఖ బుల్లితెర నటి దేవిప్రియ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. అయితే ఈ ప్రమాదం నుంచి దేవి ప్రియ క్షేమంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. దేవీ ప్రియ తన సహాయకుడితో కలిసి సోమవారం తెల్లవారుజామున కారులో చెన్నై నుంచి తిరుచ్చి వైపు బయల్దేరారు.పెరంబలూర్ వద్ద కారు టైరు పంక్చర్ కావడంతో డ్రైవర్ ముత్తు గణేశ్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తుండగా వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం దేవిప్రియ కారును ఢీకొంది.
కారు డ్రైవర్ మృతి...
ఈ ఘటనలో కారు డ్రైవర్ ముత్తు గణేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.కారు పక్కన నిలబడి ఉన్న దేవిప్రియ తృటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె సహాయకుడు దివాకర్ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఢీకొన్న వాహనాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.