సినీ నటుడు విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం
సినీ నటుడు విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం తీసుకున్నారు
సినీ నటుడు విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వగ్రామం నాగర్‌కర్నూలుజిల్లా తుమ్మన్‌పేటలో పర్యటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఆ ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను పుట్టిన ప్రాంత ప్రజలకు తన భార్య రష్మిక మంధనను విజయ్ దేవరకొండ పరిచయం చేశారు. ఈ సందర్భంగా పలు వరాలు ప్రకటించారు.
నలభై నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో...
ఈ ప్రాంతంలో ఉన్న నలభై నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని తెలిపారు. 9, 10వ తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో..
విద్యార్థులకు ఉపకారవేతనం అందిస్తామని విజయ్ దేవరకొండ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఉత్తీర్ణతతో సాధించిన వారికి స్కాలర్ షిప్ లను ఈ ఏడాదినుంచి ఇస్తున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపారు.