రామ్ చరణ్ పై ఉపాసన రివేంజ్
ఓ నెటిజన్ నెట్టింట పంచుకున్న వీడియో ప్రస్తుతం తెగవైరల్ అవుతోంది. ఆ వీడియో ఉపాసనకూ..
upasana revenge on ramcharan
రామ్ చరణ్ పై ఆయన సతీమణి ఉపాసన రివేంజ్ ఎలా ఉంటుందో చూపిస్తూ.. ఓ నెటిజన్ నెట్టింట పంచుకున్న వీడియో ప్రస్తుతం తెగవైరల్ అవుతోంది. ఆ వీడియో ఉపాసనకూ నచ్చడంతో.. ఆమె ఇన్ స్టా లో షేర్ చేశారు. సుమారు నాలుగు నెలల క్రితం.. అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకల సందర్భంగా.. రామ్‌చరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్‌ల వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో రామ్‌చరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్ ఒకే సోఫాలో కూర్చున్నారు.
ఆ సోఫా కాస్త ఇరుకుగా ఉండటంతో రామ్ చరణ్ ఉపాసనను పక్కసీటులో కూర్చోమని చెప్పారు. ఆమెను చరణ్ అలా ఆటపట్టించినందుకు.. సాయిధరమ్ తేజ్ తో కలిసి కలిసి పకపకా నవ్వుతారు. అబ్బాయిల ఫన్ ఇలా ఉంటుందన్న ఓ నెటిజన్.. దీనికి అమ్మాయిల కౌంటర్ మరో లెవెల్‌లో ఉంటుందంటూ రామ్‌చరణ్, ఉపాసనల మరో వీడియోను జత చేశారు. ఇందులో ఉపాసన రామ్‌చరణ్‌తో ఇంటి పనులన్నీ చేయించినట్టు చూపించారు. చెట్లకు నీళ్లు పోయడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, స్వయంగా కాఫీ కలిపి ఉపాసనకు ఇవ్వడం తదితర సీన్లన్నీ చూపించి.. అమ్మాయిలతో వ్యవహారం ఇలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ వీడియో కరోనా సమయంలో ఇళ్లలో ఆడవాళ్లకు హెల్ప్ చేయాలని ఒకరికొకరు ఛాలెంజ్ లు చేసుకున్నపుడు తీశారు. ఇప్పుడీ రెండు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయిe