దెబ్బకు థింకింగ్ మారిపోవాలా : అన్ స్టాపబుల్ సీజన్ 2

మంచు మోహన్ బాబు, విష్ణు, మంచు లక్ష్మిలతో తొలి ఎపిసోడ్ స్ట్రీమ్ అయింది. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని, బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్ రావిపూడి..

Update: 2022-09-17 10:35 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో, నందమూరి నట వారసుడు బాలకృష్ణ తొలిసారి హోస్ గా చేసిన షో 'అన్ స్టాపబుల్'. ఈ సెలబ్రిటీ టాక్ షో తెలుగు టాక్ షోస్ లోనే సంచలనమై.. ఎదురులేని ఘన విజయం సాధించింది. వెండితెరపై తన యాక్షన్ తో అభిమానులను ఉర్రూతలూగించే బాలయ్య.. ఈ షోలో తన కామెడీ టైమింగ్ తో వీక్షకులు, అభిమానులను మైమరపించారు. తనమార్క్ ఇంటర్వ్యూలతో పాటు.. అల్లరి, పంచ్ డైలాగ్స్ తో షో ను సూపర్ సక్సెస్ చేశారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఆహాలో స్ట్రీమ్ అయిన అన్ స్టాపబుల్ తొలి సీజన్లో పెద్ద పెద్ద సెలబ్రిటీలే వచ్చారు.

మంచు మోహన్ బాబు, విష్ణు, మంచు లక్ష్మిలతో తొలి ఎపిసోడ్ స్ట్రీమ్ అయింది. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని, బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్ రావిపూడి, అఖండ మూవీ టీమ్ బోయపాటి శ్రీను, శ్రీకాంత్, తమన్, ప్రగ్యా జైశ్వాల్, దర్శక దిగ్గజం రాజమౌళి, కీరవాణి, అల్లు అర్జున్, రష్మిక మందన్న, సుకుమార్, మాస్ మహారాజా రవితేజ, దగ్గుబాటి రానా, పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మీ లతో నడిచిన ఈ టాక్ షో సీజన్ 1కి మహేష్ బాబుతో ముగింపు పలికారు. ఈ షో ఫినాలేకి చిరంజీవి వస్తారని అందరూ అనుకున్నారు కానీ.. కుదర్లేదు.
తొలి సీజన్ పూర్తైన చాలా రోజులకు సెకండ్ సీజన్ పై ఆహా అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. అన్‌స్టాప‌బు‌ల్ రెండో సీజ‌న్ అతి త్వ‌ర‌లో ముందుకు వ‌స్తోందంటూ ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించింది. ఈ సీజన్ స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు కానీ.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..పండ‌గ త్వరలోనే మొద‌లవుతుంది అని రాసింది. ఈ ట్వీట్ చూసిన బాలయ్య అభిమానులు, నెటిజన్లు దసరా లేదా దీపావళికి అన్ స్టాపబుల్ 2 మొదలవుతుందని భావిస్తున్నారు.







Tags:    

Similar News