పవన్ నుండి తప్పించుకుంటున్న త్రివిక్రమ్?

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ టాలీవుడ్ లో మంచి దోస్త్ లన్న విషయం అందరికి తెలుసు. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తీసినా త్రివిక్రమ్ ని పవన్ కళ్యాణ్ [more]

Update: 2020-01-12 04:02 GMT

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ టాలీవుడ్ లో మంచి దోస్త్ లన్న విషయం అందరికి తెలుసు. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తీసినా త్రివిక్రమ్ ని పవన్ కళ్యాణ్ వదల్లేదు. కాకపోతే రాజకీయాల్లోకి వెళ్ళాక త్రివిక్రమ్ కి – పవన్ కళ్యణ్ కి కాస్త దూరం పెరిగినట్టుగా కనబడుతున్నప్పటికీ. వాళ్ళ మనసులు దగ్గరగానే ఉన్నాయనేది వాస్తవం. అయితే ఇంతకీ పవన్ కళ్యాణ్ ని త్రివిక్రమ్ ఎందుకు తప్పించుకుంటున్నాడంటే.. పింక్ రీమేక్ ని తెలుగులో రీమేక్ చేసే విషయమై దిల్ రాజు.. త్రివిక్రం తో చర్చ జరిపితే.. పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తే బావుంటుంది అని చెప్పడమే కాదు.. పవన్ కళ్యాణ్ తో పింక్ సినిమా చూపించి… మల్లి మీరు సినిమాలు చేస్తే బావుంటుంది అని.. ఈ సినిమా రీమేక్ మీరు చేస్తే కరెక్ట్ అని సలహా కూడా ఇచ్చాడట.

అలోచించి చెబుతా అని చెప్పిన పవన్.. కొన్నాళ్ల తర్వాత త్రివిక్రమ్ ని పిలిచి పింక్ రీమేక్ చేద్దాం.. దానికి డైలాగ్స్ రాయమని కోరగా.. అప్పటికే అలా వైకుంఠపురములో షూటింగ్ తో బిజీగా ఉన్న త్రివిక్రమ్ పింక్ రీమేక్ డైలాగ్స్ రాయడం కుదరదని చెప్పడమే కాదు.. ఈ సినిమాలో డైలాగ్స్ కన్నా ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.. కాబట్టి డైలాగ్స్ ఎవరు రాసిన పెద్దగా తేడా ఉండదని చెప్పి తప్పించుకున్నాడని టాక్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. మరి పవన్ నుండి త్రివిక్రమ్ అలా తప్పించుకు తిరగడానికి దిల్ రాజు కారణమనే టాక్ కూడా ఉంది

Tags:    

Similar News