Kantara Chapter 1 : కాంతార చాప్టర్ 1 బ్రేక్ ఈవెన్ కు రావాలంటే?

కాంతార చాప్టర్ 1 రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి

Update: 2025-10-06 07:04 GMT

కాంతార చాప్టర్ 1 రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సోషియో-ఫ్యాంటసీ థ్రిల్లర్‌గా భారీ అంచనాల మధ్య వచ్చిన కాంతార చాప్టర్ 1 మొదటి వారాంతంలోనే తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సమాచారం ప్రకారం, మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా 34 కోట్ల మేరకు షేర్‌ రాబట్టిందన్నారు.దసరా పండుగ సీజన్‌ కావడం కూడా కలెక్షన్లకు బలం చేకూర్చిందని ఆయన తెలిపారు. ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో 10 కోట్లు వసూలు చేసింది

మరో అరవై కోట్లు...
అయితే లాభాల్లోకి వెళ్లాలంటే ఇంకా దూరం ఉందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణల్లో ఈ సినిమా అడ్వాన్స్‌ల రూపంలో సుమారు 90 కోట్లకు అమ్ముడు పోయింది. అందుకే బ్రేక్‌ఈవెన్‌ సాధించాలంటే కనీసం మరో 55 నుంచి 60 కోట్లు ఇంకా వసూలు కావాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.దర్శకుడు, నటుడు రిషబ్‌ శెట్టి మళ్లీ తన ప్రతిభను నిరూపించినప్పటికీ కథా నిర్మాణంపై మరింత దృష్టి పెట్టాల్సిందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. విజువల్‌గా అద్భుతంగా తీర్చిదిద్దినా కథ అంత బలంగా లేదని, మిస్టికల్‌ ఎలిమెంట్ల మీద ఎక్కువ ఆధారపడ్డారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News