Kalki 2898 AD: కల్కి సినిమాలో ఆ ఏడుగురు చిరంజీవులు వారేనా..!

కల్కి సినిమాలో ఆ ఏడుగురు చిరంజీవులుగా ఆ ఏడుగురు హీరోలు కనిపించబోతున్నారట.

Update: 2024-01-30 06:21 GMT
Kalki 2898 AD: ప్రభాస్ నటిస్తున్న 'కల్కి' మూవీ హిందూ మైథలాజి నేపథ్యంతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీమహావిష్ణు దశావతారం అయిన కల్కి పాత్రతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రభాస్ 'కల్కి' పాత్రని పోషిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మరికొందరు హీరోలు కూడా నటిస్తున్నట్లు సమాచారం. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పేర్లను ఆల్రెడీ మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.
ఇక వీరితో పాటు ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, రానా దగ్గుబాటి, రాజమౌళి కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరందరూ హిందూ పురాణాల్లో చెప్పబడిన సప్త చిరంజీవులు పాత్రలను పోషిస్తున్నట్లు తెలుస్తుంది. హిందూ మైథలాజిలో ఇంకా చనిపోకుండా కలియుగాంతం వరకు కొందరు బ్రతికే ఉంటారు అనే కథలు మీరు వినే ఉంటారు. అలా బ్రతికి ఉన్న సప్త చిరంజీవులు.. వేద వ్యాసుడు, పరుశురాముడు, విభీషణుడు, హనుమంతుడు, కృపాచార్య, అశ్వత్థామ, బలి చక్రవర్తి (అసుర రాజు).
ఇప్పుడు ఈ ఏడు చిరంజీవులుగా ఆ ఏడుగురు కనిపించబోతున్నారని తెలుస్తుంది. వేద వ్యాసుడిగా 'రాజమౌళి', హనుమంతుడిగా 'రానా', అశ్వత్థామగా 'అమితాబ్ బచ్చన్', కృపాచార్యగా 'నాని', బలి చక్రవర్తిగా 'కమల్ హాసన్' (విలన్), పరుశురాముడు, విభీషణుడిగా.. దుల్కర్ అండ్ విజయ్ కనిపించవచ్చు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ అంచనాలు అన్ని నిజం అవుతాయో లేదో చూడాలి.
Tags:    

Similar News