సినిమాల నుంచి తప్పుకుంటున్న కాజల్ అగర్వాల్.. నిజమెంత ?

మగధీర, బృందావనం, బాద్ షా, నాయక్, ఆర్య 2, టెంపర్, రణరంగం, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో..

Update: 2022-05-05 06:25 GMT

హైదరాబాద్ : కాజల్ అగర్వాల్.. 2007లో లక్ష్మీ కల్యాణం, చందమామ సినిమాలతో తెలుగు తెరకు పరిచయమై.. అభిమానుల గుండెల్లో ఓ చందమామలా నిలిచిపోయింది. ఆ తర్వాత మగధీర, బృందావనం, బాద్ షా, నాయక్, ఆర్య 2, టెంపర్, రణరంగం, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకుంది. తెలుగు సహా.. తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం కలిపి 50కి పైగా సినిమాల్లో కాజల్ హీరోయిన్ గా నటించింది. గతేడాది తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన కాజల్.. గత నెల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

కాజల్ కొడుక్కి నీల్ కిచ్లూ అని నామకరణం చేశారు. అయితే.. కాజల్ కు సంబంధించి ఓ రూమర్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. బిడ్డ పుట్టాక.. మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న కాజల్.. ఇక తన పిల్లాడి బాగోగులు చూడటం పైనే శ్రద్ధ పెట్టిందని, కాజల్ ఇకపై సినిమాల్లో నటించబోదని ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ రూమర్లతో కాజల్ అభిమానులు షాకయ్యారు. ఆమెను మళ్లీ సినిమాల్లో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ రూమర్లలో నిజమెంతుందో తెలియాలంటే.. కాజల్ అగర్వాల్ స్పందించేంత వరకూ ఆగాల్సిందే.


Tags:    

Similar News