Akhanda : అఖండ 2 పై ఈ వార్త విన్నారా? వింటే మీరు షాకవుతారు అంతే
నందమూరి బాలకృష్ణ అభిమానులకు నిరాశ కలిగించే న్యూస్ ఇది. బాలయ్య నటిస్తున్న అఖండ 2 మూవీ సినిమా ఈ ఏడాది విడుదలకాదు.
నందమూరి బాలకృష్ణ అభిమానులకు నిరాశ కలిగించే న్యూస్ ఇది. బాలయ్య నటిస్తున్న అఖండ 2 మూవీ సినిమా ఈ ఏడాది విడుదలకాదు. అనేక కారణాలతో అఖండ 2 మూవీ విడుదలను వచ్చే ఏడాదికి మేకర్స్ ను వాయిదా వేశారు. బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో మరో సూపర్ హిట్ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నాలుగేళ్ల క్రితం విడుదలయిన అఖండ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలున్నాయి. అందులో బాలయ్య నటనతో మరో రేంజ్ కు తీసుకెళతారని అంటున్నారు.
థమన్ అందించిన సంగీతంతో...
అఖండ 2 తాండవం మూవీ కోసం బోయపాటి శ్రీనివాస్ కష్టం మామూలుగా పడలేదు. ఆయన ప్రయాగరాజ్ లో జరిగిన మహా కుంభమేళాకు వెళ్లి షూటింగ్ కూడా చేశారు. అక్కడ దృశ్యాలు ఒళ్లు జలదరించేలా ఉంటాయన్న ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ గెటప్ రివీల్ కావడంతో ఇప్పటికే అందరిలోకి మూవీ సగం వెళ్లిపోయింది. నందమూరి బాలకృష్ణ గెటప్ తో పాటు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు, పాటలు కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయన్న టాక్ ఇప్పటికే టాలీవుడ్ ను కమ్మేసింది.
పండగ నాడు..
అఖండకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం విడుదల కోసం చాలా రోజుల నుంచి అనేక తేదీలు వినిపిచాయి. ఈ నెలలో ఈ మూవీని రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు ఈ ఏడాదికి ఇక మూవీ రిలీజ్ కానట్లే. వచ్చే జనవరికి విడుదలవుతుందని అంటున్నారు. సంక్రాంతికి హిట్ కొట్టేందుకు బాలయ్య రెడీ అవుతున్నారని చెబుతున్నారు. సంక్రాంతికి చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ కూడా ఉండటంతో పండగ వేళ అలరించేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. అయితే జనవరి అంటే పెద్దగా సమయం కూడా లేకపోవడంతో నిరాశ అవసరం లేదని మేకర్స్ ఫ్యాన్స్ కు చెబుతున్నారు.