ఓటీటీలోకి శ్రీదేవి శోభన్ బాబు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే

ఇప్పుడు ఓటీటీలో విడుదలకు శ్రీదేవి-శోభన్ బాబు రెడీ అవుతున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

Update: 2023-03-16 05:34 GMT

sridevi sobhan babu

హీరో సంతోష్ శోభన్ - గౌరీ కిషన్ జంటగా నటించిన సినిమా శ్రీదేవి-శోభన్ బాబు. సుస్మిత కొణిదెల- విష్ణుప్రసాద్ కలిసి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న థియేటర్లకు వచ్చింది. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో.. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ జోనర్లో వచ్చిన సినిమా ఇది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది.

ఇప్పుడు ఓటీటీలో విడుదలకు శ్రీదేవి-శోభన్ బాబు రెడీ అవుతున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకోగా.. మార్చి 30 నుంచి స్ట్రీమ్ అవ్వనుంది. ఈ సినిమాలో హీరో తల్లిదండ్రులుగా రోహిణి, నాగబాబు ముఖ్యపాత్రలను పోషించారు. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. హీరో, హీరోయిన్ మధ్య పరిచయం, ప్రేమ.. కథంతా రొటీన్ గా అనిపించడంతోనే థియేట్రికల్ రన్ లో సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి మార్కులు పొందుతుందో చూడాలి.


Tags:    

Similar News