kantara Chapter 1 : కాంతార చాప్టర్ 1 రికార్డులను క్రియేట్ చేస్తూ...బ్రేక్ చేస్తూ? జూనియర్ ఎన్టీఆర్ హింట్ తో

శాండల్ వుడ్ స్టార్ రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 మూవీ థియేటర్లలో కలెక్షన్ల వసూళ్లలో దూసుకుపోతుంది

Update: 2025-10-06 05:52 GMT

శాండల్ వుడ్ స్టార్ రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 మూవీ థియేటర్లలో కలెక్షన్ల వసూళ్లలో దూసుకుపోతుంది. ఈ మూవీకి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు లీడ్ రోల్ లో నటించారు. ఈ నెల 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిన కాంతార చాప్టర్ 1 మూవీ కన్నడ, మలయాళం, హిందీ, తమిళం, తెలుగులో ఒకేసారి విడుదలయింది. అయితే బాక్సాఫీస్ వద్ద కాంతార చాప్టర్ 1 రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఇరవై నాలుగు గంటల్లోనే మిలియన్ టిక్కెట్లకు పైగానే బుక్ అయ్యాయంటే కాంతారా ఏ రకమైన ట్రెండ్ క్రియేట్ చేస్తుందో చెప్పాల్సిన పనిలేదు.

జూనియర్ ఎన్టీఆర్ హింట్ తో...
కాంతార చాప్టర్ 1లో రిషబ్ శెట్టితో పాటు టీం మొత్తం కష్టపడిన తీరును జూనియర్ ఎన్టీఆర్ వివరించడం ఈ మూవీకి అదనపు బలంగా మారింది. కొండ ప్రాంతాల్లోకి రహదారి సౌకర్యం లేని చోటకు కూడా మూవీ టీం వెళ్లడాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. జూనియర్ ఎన్టీఆర్ అక్కడకు వెళ్లి చూసి ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని ముందుగానే హింట్ ఇచ్చారు. దీంతో ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్ ఫాం బుక్ మై షోలో యాభై లక్షల టిక్కెట్లు అమ్ముడు పోయినట్లు మూవీ మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.
ఒక్కరోజులోనే మిలియన్ టిక్కెట్లు...
వరసగా నాలుగో రోజు కూడా టిక్కెట్ సేల్స్ ఆన్ లైన్ లో మిలియన్ మార్క్ దాటడంతో కాంతార చాప్టర్ 1 మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దసరా సెలవులు కూడా కలసి రావడంతో కాంతార చాప్టర్ 1 ను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి భారీగా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. మిథికల్ డ్రామా నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీలో రుక్మిణి వసంత్ ఫీ మేల్ లీడ్ రోల్ నటించారు. జయరామ్, ప్రమోద్ శెట్టి, గుల్షన్ దేవయ్య వంటి వారు కీలక పాత్రలను పోషించారు. కాంతార చాప్టర్ 1 మూవీ హిస్టరీని క్రియేట్ చేస్తుందంటున్నారు.


Tags:    

Similar News