జపాన్ లో ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డు.. రాజమౌళి ట్వీట్

కాలక్రమేణా వ్యాపార స్వరూపం మారిపోయింది. ఆ మధుర జ్ఞాపకాలు పోయాయి. కానీ జపనీస్ అభిమానులు..

Update: 2023-01-28 10:29 GMT

#RRRinJapan

ఆర్ఆర్ఆర్ తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన ఘనత దర్శకుడు రాజమౌళికే దక్కుతుంది. పాన్ ఇండియా సినిమాగా గతేడాది మార్చిలో విడుదలైన ఆర్ఆర్ఆర్ హవా.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భారత్ లో అఖండ విజయాన్నందుకున్న ఆర్ఆర్ఆర్.. ఇటీవలే జాపనీస్ లో.. జపాన్ లోనూ విడుదలైంది. ఈ చిత్రానికి అక్కడ ఊహించని స్పందన వచ్చింది. జపాన్ లో ఆర్ఆర్ఆర్ 42 కేంద్రాల్లో నేరుగా, షిఫ్ట్స్ పద్ధతిలో మరో 114 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఇతర దేశంలో.. 114 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది.

గతేడాది అక్టోబర్ 21న జపనీస్ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. చిత్రం శతదినోత్సవ మార్కు దాటిన విషయాన్ని దర్శకుడు రాజమౌళి ట్విటర్ ద్వారా తెలిపారు. జపాన్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. "ఆ రోజుల్లో ఒక సినిమా 100 రోజులు, 175 రోజులు నడుస్తుండటం చాలా పెద్ద విషయం. కాలక్రమేణా వ్యాపార స్వరూపం మారిపోయింది. ఆ మధుర జ్ఞాపకాలు పోయాయి. కానీ జపనీస్ అభిమానులు మాకు తిరిగి ఆ ఆనందాన్ని కలిగించారు. లవ్ యూ జపాన్" అని రాజమౌళి ట్వీట్ లో పేర్కొన్నారు.
ఎన్నో రికార్డులు సృష్టించిన ఆర్ఆర్ఆర్.. విదేశాల్లోనూ రికార్డులతో పాటు ఎన్నో అవార్డులను సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఈ మధ్యే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఆస్కార్ పురస్కారానికి కూడా నామినేట్ అయింది. చరిత్ర సృష్టించేందుకు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ముంగిట ఒక్క అడుగు దూరంలో నిలబడింది.




Tags:    

Similar News