థియేటర్ల బంద్ అనేది మీడియా సృష్టి : దిల్ రాజు

జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ అనేది మీడియా సృష్టించినదేనని నిర్మాత దిల్ రాజు తెలిపారు

Update: 2025-05-26 12:11 GMT

జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ అనేది మీడియా సృష్టించినదేనని నిర్మాత దిల్ రాజు తెలిపారు. అయితే దిల్ రాజు మాట్లాడుతూ తమలో తమకే సయోధ్య లేదని తెలిపారు. మొన్న అల్లు అరవింద్ ప్రెస్‌మీట్ పెట్టారని ఈ రోజు తాను ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని కూడా దిల్ రాజు చెప్పుకొచ్చారు.

ఎవరో తప్పుగా...
ప్రభుత్వానికి ఎవరో తప్పుగా సమాచారం ఇచ్చారన్న దిల్ రాజు, తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సమావేశంలో జూన్ నెల ఒకటి నుంచి థియేటర్ల బంద్ చేయాలని నిర్ణయించారని, కానీ అది చలన చిత్ర మండలి తీసుకున్న నిర్ణయం కాదని తెలిపారు. ఎగ్జిబిటర్లకు అనేక సమస్యలనున్నాయని, అయితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూర్చుని చర్చించుకుని సమస్యకు పరిష్కారం కనుగొంటామని చెప్పారు.


Tags:    

Similar News