అంగుళం దూరంలో చావు కనిపించింది : హీరో విశాల్

ప్రముఖ హీరో విశాల్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆయన తీవ్ర గాయాల పాలయ్యేవారు

Update: 2023-02-23 03:49 GMT

ప్రముఖ హీరో విశాల్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆయన తీవ్ర గాయాల పాలయ్యేవారు. విశాల్ హీరోగా నటిస్తున్న మార్క్ ఆంటోనీ సినిమా షూటింగ్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తు్నారు.

పెద్ద ప్రమాదమే...
ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఒక వాహనం షూటింగ్ స్పాట్ లోకి దూసుకొచ్చింది. అయితే అంతే వేగంగా విశాల్ దాని నుంచి తప్పించుకున్నారు. అయితే సాంకేతిక సమస్య వల్ల ఈ ప్రమాదం జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై విశాల్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. 'జస్ట్ కొన్ని సెకన్లు, కొన్ని అంగుళాల దూరంలో నా చావు కనిపించింది. థ్యాంక్ యూ గాడ్. ఈ ఘటన తర్వాత మళ్లీ యథావిధిగా షూటింగ్లో పాల్గొన్నా' అని ఆయన పేర్కొన్నారు.


Tags:    

Similar News