చైతూతో కీర్తి.. మరి నాగ్ తో?

మన్మధుడు 2 షూటింగ్ తో నాగార్జున ప్రస్తుతానికి ఫుల్ బిజీ. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు సీక్వెల్ యమ ఫాస్ట్ గా చిత్రీకరణ జరుపుకుంటుంది. నాగార్జున మన్మధుడు [more]

Update: 2019-07-02 04:52 GMT

మన్మధుడు 2 షూటింగ్ తో నాగార్జున ప్రస్తుతానికి ఫుల్ బిజీ. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు సీక్వెల్ యమ ఫాస్ట్ గా చిత్రీకరణ జరుపుకుంటుంది. నాగార్జున మన్మధుడు 2 షూటింగ్ పూర్తి కాగానే కళ్యాణ్ కృష్ణ తో బంగార్రాజు సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు. నాగ చైతన్య తో నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమా ని కళ్యాణ్ కృష్ణ ఐదు నెలలో పూర్తి చేసి సంక్రాతి కి టార్గెట్ గా విడుదల చెయ్యబోతున్నాడు. అయితే ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ ని రెమ్యునరేషన్ ఇవ్వకుండా… లాభాల్లో వాటా ఇస్తానని నాగార్జున దర్శకుడు కళ్యాణ్ కి చెప్పాడట. ఎలాగూ ప్లాప్స్ లో ఉన్న కళ్యాణ్ దానికి ఒప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది.

ఇక ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు స్క్రిప్ట్ ని చెక్కుతున్నాడు. దానితో పాటుగా బంగార్రాజు కోసం నటీనటుల ఎంపిక కూడా మొదలెట్టినట్లుగా సమాచారం. ఇప్పటికే నాగ చైతన్య పక్కన కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారనే న్యూస్ ఉంది. ఇక తాజాగా నాగార్జున సరసన మరో యంగ్ బ్యూటీ పేరు వినబడుతుంది. అది కూడా స్టార్ హీరోలతో క్షణం తీరిక లేకుండా షూటింగ్ ల మీద షూటింగ్ లు చేస్తూ భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న పూజ హెగ్డే, నాగ్ సరసన బంగార్రాజు లో రొమాన్స్ చేయబోతున్నట్లుగా ఫిలిం నగర్ టాక్. మరి మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ లాంటి యంగ్ హీరోలే కాదు. అవకాశమొస్తే సీనియర్ హీరోని వదలను అన్నట్టుగా ఉంది పూజ వ్యవహారం. ఇక పూజ గనక నాగ్ సరసన నటించడమే నిజమైతే.. మన్మధుడు 2 ల రకుల్ తో రొమాన్స్ చేస్తున్న నాగ్ ఇప్పుడు బంగార్రాజు లో పూజ తో కూడా రొమాన్స్ చేస్తాడన్నమాట.

Tags:    

Similar News