ఓజీ ఓవర్సీస్ లో ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలిస్తే?

పవన్ కల్యాణ్ మూవీ నటించిన ఓజీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లలో దూసుకు పోతుంది.

Update: 2025-09-25 07:17 GMT

పవన్ కల్యాణ్ మూవీ నటించిన ఓజీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లలో దూసుకు పోతుంది. ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించి అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది. ఓజీ మూవీ మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన చేశారు. ఓవర్సీస్ లో విడుదలయిన ఈ సినిమా నార్త్ అమెరికాలోనే తొలిరోజున 26 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు నిర్మాతలు తెలిపారు.

దసరా సెలవులు కావడంతో...
పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటించిన ఈ మూవీ ఓవర్సీస్ లోనే ఇన్ని వసూళ్లు తొలి రోజున రాబడితే ఇక రానున్న కాలంలో అన్ని రికార్డులను బద్దలు కొడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఓవర్సీస్ ప్రీమియర్ లో మూడు మిలియన్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించడంతో అందరి చూపు ఇక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేస్తుందన్నది అంచనాలకు అందడం లేదు. దసరా సెలవుల సమయంలో ఓజీ మూవీ విడుదల కావడంతో మూవీ కలెక్షన్లను ఆపడం ఎవరి తరమూ కాదన్నది టాలీవుడ్ వర్గాల అంచనా.


Tags:    

Similar News