రీ ఎంట్రీ కి అంత బడ్జెట్ ఆ?
పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం కన్ఫర్మ్ అయ్యిందో.. లేదో.. పవన్ కళ్యాణ్ సినిమాల పై రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. [more]
పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం కన్ఫర్మ్ అయ్యిందో.. లేదో.. పవన్ కళ్యాణ్ సినిమాల పై రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. [more]
పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం కన్ఫర్మ్ అయ్యిందో.. లేదో.. పవన్ కళ్యాణ్ సినిమాల పై రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. పవన్ హీరోగా పింక్ రీమేక్ కి దిల్ రాజు 30 కోట్ల బడ్జెట్ పెడుతుంటే.. పవన్ కి 50 కోట్ల పారితోషకం ఇస్తున్నాడని టాక్ ఉంది. అయితే పింక్ రీమేక్ బడ్జెట్ తక్కువే కానీ.. పవన్ పారితోషకం మాత్రం హై. అలాగే పవన్ తో సినిమా గనక ఆయన ఫ్లైట్ ఖర్చులు వగైరా అన్ని దిల్ రాజుకి తడిసి మోపుడవుతున్నాయి. అయితే ఇపుడు క్రిష్ తో చేస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమా బడ్జెట్ వింటే షాకవ్వాల్సిందే. నిర్మాత ఏఎం రత్నం క్రిష్ – పవన్ కాంబో మూవీ కి ఏకంగా 100 కోట్లు బడ్జెట్ పెడుతున్నాడని టాక్ నడుస్తుంది.
కెరీర్ లో ఓక్కసారి కూడా పీరియాడికల్ సినిమా చేయని పవన్ .. తొలిసారి క్రిష్ కాంబినేషన్‌లోస్వాతంత్య్రానికి పూర్వం కథలో బందిపోటుగా కనిపించనున్నాడని.. ఆ సినిమాలో అలనాటి కట్టడాల సెట్స్ కోసమే 20 నుండి 25 కోట్లు బడ్జెట్ అవుతుందని.. ఇక మిగతా 75 కోట్లు సినిమాకి ఖర్చు పెడుతున్నట్లుగా చెబుతున్నాడు. మరి పవన్ పారితోషకంతో కలుపుకుని 100 కోట్లా? లేదంటే కేవలం సినిమా బడ్జెట్ 100 కోట్లా? అనేది క్లారిటీ లేదు కానీ… పవన్ – క్రిష్ సినిమా బడ్జెట్ 100 కోట్ల ఫిగర్ మాత్రం మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక క్రిష్ – పవన్ సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్ లో ఫిబ్రవరి 4 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుందని తెలుస్తుంది.