Unstoppable 2 : తెలుగుదేశంలో చేరమన్న బాలయ్య.. పవన్ ఏమన్నారంటే..

పవన్ కల్యాణ్ ఎపిసోడ్ పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు. ఆ ఎపిసోడ్.. ప్రభాస్ ఎపిసోడ్లను మించి.. సరికొత్త స్ట్రీమింగ్..

Update: 2023-02-10 06:54 GMT

unstoppable 2

బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తోన్న అన్ స్టాపబుల్ సీజన్ 2 సూపర్ డూపర్ సక్సెస్ అయింది. సెకండ్ సీజన్ లో ఇప్పటివరకూ చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ అవగా.. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఎపిసోడ్లతో షో ని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. పవన్ కల్యాణ్ ఎపిసోడ్ పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు. ఆ ఎపిసోడ్.. ప్రభాస్ ఎపిసోడ్లను మించి.. సరికొత్త స్ట్రీమింగ్ టైం ను సాధించి రికార్డు సెట్ చేసింది. ఇక రెండో ఎపిసోడ్ ఫిబ్రవరి 9 రాత్రి రిలీజ్ చేశారు. పార్ట్ 1 లో సినిమాల గురించి మాట్లాడగా.. పార్ట్ 2 లో ఎక్కువ రాజకీయాల గురించి ప్రస్తావించాడు బాలయ్య. ఈ ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో పవన్ రాజకీయాల్లో ఎందుకు వచ్చారో వివరించారు. అనంతరం బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. టీడీపీ గురించి చెప్పి.. తెలుగుదేశంలో జాయిన్ అవ్వొచ్చు కదా.. మళ్లీ వేరే పార్టీ ఎందుకు ? అని ప్రశ్నించారు.

అందుకు పవన్ బదులిస్తూ.. "ప్రజాస్వామ్యంలో అధికారం అందరికి అందాలి. పాలిటిక్స్ లో ఆధిపత్య ధోరణి ఎక్కువుంది. కింద వాళ్లకి సంక్షేమ పథకాలు అందినా అధికారం అందట్లేదు. లోహియా, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ గారి ప్రభావం నా మీద ఎక్కువగా ఉంది. అన్నయ్య తర్వాత కాంగ్రెస్ కి వెళ్లినా నేను మాత్రం వెళ్ళలేదు. ఏ పార్టీలు మాట్లాడినా సంక్షేమ పథకాలు మాత్రమే మాట్లాడతాయి. అవే ఇస్తాం అంటారు. కానీ అవి ప్రజలు ఎదగడానికి తోడ్పడవు. నెక్స్ట్ ట్యాలెంట్ జనరేషన్ కి ఎవరూ సపోర్ట్ చెయ్యట్లేదు. ఇక్కడి నుంచి అందరూ అమెరికా, విదేశాలకు వెళ్లి అక్కడ బతికేస్తున్నారు. వేరే పార్టీల్లో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్లకు ఉంటాయి. నేను వెళ్లి ఏ పార్టీలో జాయిన్ అయినా అక్కడ నా ప్రభావం ఉండకపోవచ్చు. నా సిద్ధాంతాలు వాళ్లకు నచ్చకపోవచ్చు. అలాగే అన్ని పార్టీలు అధికారం కోసమే వస్తాయి. కానీ నేను అలా కాదు గెలవకపోయినా, ఓడినా ప్రజల కోసం ఉంటాను" అని పేర్కొన్నారు.




Tags:    

Similar News