ఈవారం ఓటీటీల్లోకి వస్తోన్న సినిమాలివే

అజిత్ హీరోగా తమిళంలో రూపొందిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించగా, హెచ్ వినోత్ దర్శకత్వం వహించాడు. జనవరి 11న థియేటర్లలో..

Update: 2023-02-07 06:33 GMT

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై సందడి చేసేందుకు ఈవారం మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆ జాబితాలో 'తునీవు' (తెగింపు) ఒకటిగా ఉంది. అజిత్ హీరోగా తమిళంలో రూపొందిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించగా, హెచ్ వినోత్ దర్శకత్వం వహించాడు. జనవరి 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల కోసం నెట్ ఫ్లిక్స్ లో ఈనెల 8 నుండీ స్ట్రీమింగ్ కు రాబోతోంది.

ఈవారం ఓటీటీలోకి వస్తోన్న మరో సినిమా రాజయోగం. చిన్న సినిమాగా వచ్చిన రాజయోగం.. గతేడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైంది. సాయి రోనక్ - అంకిత సాహ జంటగా నటించిన ఈ సినిమాకి కూడా థియేటర్స్ లో సరైన రెస్పాన్స్ రాలేదు. ఫిబ్రవరి 9 నుండి 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో రాజయోగం స్ట్రీమ్ అవనుంది.
సుధీర్ బాబు హీరోగా నటించిన 'హంట్' జనవరి 26వ తేదీన థియేట్రికల్ రిలీజ్ ను జరుపుకుంది. శ్రీకాంత్ - భరత్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించిన 'హంట్' ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక వారంలోనే వెనుదిరిగింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ కానుంది.


Tags:    

Similar News