మెహ్రీన్‌ని చూసి కుళ్లుకుంటున్నారా?

Update: 2018-08-20 07:12 GMT

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది మెహ్రీన్ పిర్జాదా. 'కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి చిత్రంతోనే విజ‌యాన్ని అందుకొంది. దాంతో అవ‌కాశాలు వెల్లువెత్తాయి. అయితే ఆ త‌ర్వాత అమ్మ‌డు అనుకొన్న రేంజ్‌లో స‌క్సెస్‌లు సాధించ‌లేదు. అవ‌కాశాలవ‌ర‌కు అదర‌గొట్టినా విజ‌యాలు మాత్రం ద‌క్క‌లేదు. మామూలుగా సినిమా ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ లేదంటే ప‌ల‌క‌రించేవాళ్లే ఉండ‌రు. అవ‌త‌లివాళ్ల‌లో ఎంత టాలెంట్ ఉన్నా స‌రే, ప‌ట్టీ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తారు. క‌లిసిరాదులే అని అటువైపు చూడ‌టం మానేస్తారు. కానీ మెహ‌రీన్ విష‌యంలో మాత్రం అందుకు భిన్నంగా జ‌రుగుతోంది. రీసెంట్‌గానే కేరాఫ్ సూర్య‌, జ‌వాన్‌, పంతం సినిమాల‌తో ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకొంది. అయినా స‌రే, ఆమె జోరు మాత్రం ఆగడం లేదు. వ‌రుస‌బెట్టి ఆఫ‌ర్లు కొట్టేస్తోంది. ఆ జోరు చూసి తోటి హీరోయిన్లు కూడా కుళ్లుకునే ప‌రిస్థితి.

మీడియాలో అయితే మెహ్రీన్ హంగామా చూసి ర‌క‌ర‌కాలుగా వార్త‌లొస్తున్నాయి. ఈమె ఆఫ‌ర్లు అందుకోవ‌డం వెన‌క ర‌హ‌స్య‌మేంటి? స‌క్సెస్‌లు లేవు, చెప్పుకోద‌గ్గ రేంజిలో క్రేజీ లేదు.. అయినా ఎలా ఆఫ‌ర్లు అంటూ క‌థ‌నాలు రాస్తున్నాయి. మొత్తంగా అయితే తోటి హీరోయిన్ల‌తో పాటు, మీడియాకి కూడా కంట‌గింపుగా మారింది మెహ్రీన్‌. ఈమ‌ధ్యే ఈమె సుధీర్‌బాబు చిత్రంతో పాటు, బెల్లంకొండ చిత్రంలో న‌టించేందుకు ఒప్పుకుంది. అంత‌కుముందే 'ఎఫ్‌2'లో న‌టించేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేస్తోంది. స‌క్సెస్‌లు లేక‌పోయినా ఈ రేంజిలో ఆఫ‌ర్లు కొల్ల‌గొడుతోందంటే ఇక‌, రెండు మూడు వ‌ర‌స విజ‌యాలొచ్చాయంటే మెహ్రీన్ ఎవ్వ‌రికీ చిక్క‌దేమో అనిపిస్తోంది. ఫ‌లితాల మాట అటుంచింతే, మెహ్రీన్ క‌ష్ట‌ప‌డే విధానం, ఆమె శ్ర‌ద్ధ‌, త‌ప‌న ఆక‌ట్టుకొంటోంద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

Similar News