మెగాస్టార్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డు
ఈ విషయాన్ని కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. చిరంజీవికి ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్..
indian film personality of the year 2022
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డు వరించింది. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చలన చిత్రోత్సవం నవంబర్ 20న ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో చిరంజీవి 150కి పైగా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. చిరంజీవికి ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. గోవా వేదికగా జరుగుతున్న ఈ చలన చిత్రోత్సవ వేడుకలు నవంబర్ 28 వరకూ కొనసాగనున్నాయి.
తనకు ఈ అవార్డును ప్రకటించడంపై చిరంజీవి స్పందించారు. ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి ఎంపిక చేయడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటన తనకెంతో సంతోషం కలిగించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు.