తమన్ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తమన్ మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయని తెలిపారు. తమన్ ఎంత కలత చెంది ఉంటే ఇలా స్పందించారో అని చిరంజీవి అన్నారు. విషయం ఏదైనా సోషల్ మీడియా మాటల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చిరంజీవి కూడా అభిప్రాయపడ్డారు. తమన్ అభిప్రాయాలతో తాను కూడా ఏకీభవిస్తున్నానని తెలిపారు. సోషల్ మీడియాలో హీరోల అభిమానులు ట్రోల్స్ చేయడం ఆపాలని, ఆ ట్రోల్స్ కారణంగా ఆ వ్యక్తులపై ఎలా ఉంటుందో ఆలోచించాలని చిరంజీవి కోరారు.
తమన్ ఏమన్నారంటే?
ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తుందని, నిర్మాత బాగుంటేనే ఇండ్రస్ట్రీ బాగుంటుందని తమన్ అన్నారు. డాకూ మహారాజ్ సక్సెస్ మీట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నెగిటివిటీని వ్యాప్తి చేసుకుంటూ పోతే మనకు మనమే నష్టం చేకూర్చుకున్నట్లవుతుందని తెలిపారు. ఉదయం లేస్తామో కూడా మనకు తెలియదని, అలాంటప్పుడు ఎందుకింత నెగిటివ్ అని అన్నారు. ప్రతి హీరో ఎంతో కష్టపడుతున్నారని, తెలుగు సినిమా పరువును మన చేతుల్లో మనమే దిగజార్చుకంటున్నామని తమన్ చేసిన వ్యాఖ్యానించారు.