కైకాలకు చిరంజీవి ఫోన్
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. కైకాల త్వరగా కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. కైకాల సత్యనారాయణ పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడుతూ అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని నిన్న అపోలో వైద్యులు చెప్పారు.
వైద్యులతో...
దీంతో కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి వైద్యుల సాయంతో కైకాల సత్యనారాయణతో మాట్లాడారు. త్వరగా కోలుకుని ఇంటికి వస్తారని చిరంజీవి ఆయనతో చెప్పారు. అపోలో వైద్యులను అడిగి కైకాల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కైకాల త్వరగా ఇంటికి వస్తారని చిరంజీవి ఆకాంక్షించారు.