మెగా స్టార్ యూకే ప్రభుత్వం అరుదైన గౌరవం

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. యూకే ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించాలని నిర్ణయించింది

Update: 2025-03-14 06:41 GMT

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. యూకే ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు యూకే పార్లమెంటు నిర్ణయించింది. నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంతో పాటు ప్రజా సేవలోనూ పాల్గొని విశేష కృషి చేసిన చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించాలని నిర్ణయించింది.

ఈ నెల 19వ తేదీన...
ఈ నెల 19వ తేదీన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. చిరంజీవికి ఎన్నో రివార్డులు, అవార్డులు లభించాయి. ఆయన కష్టపడి స్వయంకృషితో ఎదిగిన తీరు అందరికీ ఆదర్శప్రాయమని భావించి ఈ పురస్కారాన్ని అందచేయనున్నారు సినీ రంగంలో పోటీని తట్టుకుని నిలిచి తన స్వయం శక్తితోకోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవికి మరో అరుదైన పురస్కారం లభించడం పట్ల టాలీవుడ్ పరిశ్రమలో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News