అనుమానాస్పద స్థితిలో రెంజూషా మీనన్ మరణం..

మలయాళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెంజూషా మీనన్.. నేడు ఆమె నివాసంలో నిర్జీవస్థితిలో కనిపించారు.

Update: 2023-10-30 11:48 GMT

టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించి మలయాళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెంజూషా మీనన్.. నేడు (అక్టోబర్ 30) ఆమె నివాసంలో నిర్జీవస్థితిలో కనిపించారు. కేరళ తిరువనంతపురంలోని కరియమ్‌ లో ఒక ఫ్లాట్ లో ఆమె జీవిస్తున్నారు. ఆమెతో పాటు భర్త, అమ్మానాన్నలు కూడా ఉంటున్నారని సమాచారం. అయితే ఈరోజు ఆమె తన ఫ్లాట్ లో మరణించి కనిపించడం అందర్నీ షాక్ కి గురి చేసింది. ఈ విషయం పట్ల మలయాళ సినీ పరిశ్రమ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఆమె మరణానికి గల రీజన్ ఏంటనేది ఇంకా తెలియలేదు. కేరళ పోలీసులు దీని పై కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. ఇక ఈ మరణం పై కేరళలో వస్తున్న కథనాలు ఏంటంటే.. రెంజూషా మీనన్ నటించడమే కాకుండా కొన్ని టీవీ సీరియల్స్ కి లైన్ ప్రొడ్యూసర్‌గా కూడా చేస్తున్నారని, గత కొంతకాలంగా ఆమె ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెబుతున్నాయి. మరి ఆమె మరణ వెనుక ఉన్న కారణం తెలియాలంటే పోలీసులు, కుటుంబసభ్యుల నుంచి వివరణ రావాల్సిందే.


Tags:    

Similar News