కొత్త హీరోయిన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం

Update: 2018-08-10 10:24 GMT

గూఢచారి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చింది తెలుగమ్మాయి శోభితా ధూలిపాళ్ల. ఆ సినిమా మంచి హిట్ కావడంతో చాలా హ్యాపీగా ఉంది. అయితే, గూఢచారి సినిమా చూసిన మహేష్ బాబు సినిమాపై ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించాడు. హీరో అడవి శేష్ బాగా నటించాడని అభినందించాడు. చిత్రబృందానికి అభినందనలు తెలిపాడు. అయితే, మహేష్ బాబు ట్వీట్ కు రిట్వీట్ చేసిన శోభిత కేవలం ‘థాంక్యూ’ అని మాత్రమే రిప్లై ఇచ్చింది. ఇది మహేష్ అభిమానులకు మండింది. తమ హీరోకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదని ట్విట్టర్ లో ఆమెను ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. అయితే, మహేష్ బాబు అంటే తనకు అభిమానమని శోభిత అంటోంది. థ్యాంక్యూ అంటే మర్యాదేనని స్పష్టం చేస్తోంది.

 

 

Similar News