మనదగ్గర బేరాలేవమ్మా.. అంటున్న మహేష్
గత రెండు రోజుల్లోగా సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ హంగామా చూసిన ఎవ్వరికైనా సరిలేరు నీకెవ్వరూ టీజర్ పై అమితాసక్తి రావడం ఖాయం. సరిలేరు నీకెవ్వరూ టీజర్ [more]
గత రెండు రోజుల్లోగా సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ హంగామా చూసిన ఎవ్వరికైనా సరిలేరు నీకెవ్వరూ టీజర్ పై అమితాసక్తి రావడం ఖాయం. సరిలేరు నీకెవ్వరూ టీజర్ [more]
గత రెండు రోజుల్లోగా సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ హంగామా చూసిన ఎవ్వరికైనా సరిలేరు నీకెవ్వరూ టీజర్ పై అమితాసక్తి రావడం ఖాయం. సరిలేరు నీకెవ్వరూ టీజర్ రిలీజ్ కౌన్ డౌన్ ట్రేండింగ్ లో ఉంది అంటే…. మహేష్ బాబు సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంతెలా ఎదురు చూస్తున్నారో తెలుస్తుంది. అనిల్ రావిపూడి మహేష్ ని ఎలా చూపించబోతున్నాడో అనే క్యూరియాసిటీకి బ్రేకులు పడిపోయాయి. మహేష్ బాబు ఎప్పటిలాగే స్టైలిష్ గా ఆర్మీ ఆఫీసర్ లుక్ లో ఇరగదీస్తున్నాడు. ఆర్మీ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా టీజర్ కూడా ఆర్మీ బ్యాగ్డ్రాప్ తోనే రిచ్ గా మొదలవుతుంది.
ఆర్మీ లుక్ లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తన సైన్యాన్ని వేసుకుని.. బ్యాగ్రౌండ్ లో మీరెవరో మాకు తెలియదు, మీకు మాకు ఏ రక్త సంబంధము లేదు… కానీ మీ కోసం మీ పిల్ల ల కోసం పగలు రాత్రి, ఎండా వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం.. ఎందుకంటే మీరు మా బాధ్యత అంటూ మహేష్ చెప్పే సుదీర్ఘ డైలాగ్ మహేష్ స్టైలిష్ లుక్, మహేష్ ఆర్మీ లుక్ అన్ని అదరగొట్టేలా ఉన్నాయి. విజయశాంతి రాయల్ లుక్, ప్రకాష్ రాజ్ పొలిటికల్ లుక్ తో పాటుగా మహేష్ యాక్షన్ సీన్స్ కూడా హైలెట్ అనేలా ఉన్నాయి. భయపడేవాడే బేరానికొస్తాడు, మనదగ్గర బేరాలేవమ్మా అంటూ మహేష్ అరిచే అరుపు కాస్త.. ఇబ్బందిగా అనిపించినా.. ప్రకాష్ రాజ్ టీజర్ చివర్లో చెప్పే ప్రతి సంక్రాంతికి అల్లుల్లోస్తారు, ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు అంటూ చెప్పే ఇరిటేటింగ్ డైలాగ్ మాత్రం అదుర్స్. మరి అనిల్ రావిపూడి గత సంక్రాంతిలా కామెడి అల్లుళ్ళని దింపకుండా….ఏకంగా అందరిని గడగడలాడించే మొగుణ్ణే దింపుతున్నాడన్నమాట. ఇక సరిలేరు నీకెవ్వరూ సినిమా అల్లు అలా వైకుంఠపురంలో కన్నా ఓ అడుగు ముందే అంటే జనవరి 11 కే విడుదల అంటూ అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు.