మహేష్ - రాజమౌళి సినిమా అప్డేట్.. మరో ఆరునెలల్లో ?

ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి.. ఇక మహేష్ మూవీపై దృష్టి పెట్టబోతున్నారట.

Update: 2022-04-02 12:46 GMT

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం #SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు జక్కన్న. ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి.. ఇక మహేష్ మూవీపై దృష్టి పెట్టబోతున్నారట. చాలా ప్రీ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని పూర్తి చేసి మరో 6 నెలల్లో సినిమాను ప్రారంభించనున్నట్టు రాజమౌళి వెల్లడించారు.

రాజమౌళి 6 నెలలు అన్నారంటే.. దానికి ఇక సంవత్సరం సమయం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూస్తుంటే మహేష్ , రాజమౌళి మూవీ 2023లోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట" సినిమా చేస్తున్నాడు. తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో #SSMB28ని చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక SSMB29 పట్టాలెక్కనుంది.


Tags:    

Similar News