హీరో విజయ్ కి హైకోర్టులో ఊరట.. ఆ కేసులో కీలక ఆదేశాలు

ఆ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై విజయ్ అసహనం వ్యక్తం చేశారు. తనపై ప్రత్యేక న్యాయమూర్తి తనపై వ్యక్తిగతంగా

Update: 2022-01-29 06:16 GMT

ప్రముఖ తమిళ హీరో విజయ్ కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. చాలాకాలం క్రితం ఆయన లగ్జరీ బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కారుకు ఎంట్రీ టాక్స్ చెల్లించకపోవడంతో.. విజయపై వాణిజ్య పన్నుల శాఖ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేసిన ప్రత్యేక న్యాయమూర్తి ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సమాజంలో మంచి పేరు, పలుకుబడి ఉన్న సెలబ్రిటీలు ఇలా పన్నుల ఎగవేతకు పాల్పడటం సమంజసం కాదని.. ఆయన వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత ఎంట్రీ ట్యాక్స్ ను చెల్లించారు విజయ్. కానీ.. ఆ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై విజయ్ అసహనం వ్యక్తం చేశారు. తనపై ప్రత్యేక న్యాయమూర్తి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను రద్దు చేయలంటూ విజయ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన మద్రాస్ హైకోర్టు.. విజయ్ పై ప్రత్యేక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పన్ను మినహాయింపు కేసులో విజయపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ వాణిజ్య పన్నుల శాఖకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.


Tags:    

Similar News