పవన్ కి షాకిచ్చిన ఫ్యాన్స్?

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అని వేచి చూసిన ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో షాకిచ్చాడు.పవన్ ఫాన్స్ కి పింక్ [more]

Update: 2020-02-04 05:13 GMT

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అని వేచి చూసిన ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో షాకిచ్చాడు.పవన్ ఫాన్స్ కి పింక్ రీమేక్ చెయ్యడం నచ్ఛలేదు.. కానీ పవన్ మాత్రం పింక్ రీమేక్ చేసేస్తున్నాడు. అయితే ఎలాగోకలా పవన్ ఫ్యాన్స్ రియలైజ్ అయ్యారు. ఎందుకంటే పవన్ వరసగా సినిమాలు ఒప్పుకుంటూ ఫ్యాన్స్ కి పండగ చేసుకునే అవకాశం ఇస్తున్నాడు. అయితే పింక్ రీమేక్ లో బిజీగా వున్న పవన్ కి ఫ్యాన్స్ షాకిచ్చారు. పింక్ రీమేక్ మొదలెట్టిన రోజునే పవన్ లుక్ ని రివీల్ చేసిన ఫ్యాన్స్.. తాజాగా పవన్ సినిమాలో చెప్పే ఓ డైలాగ్ ని లీక్ చేసారు.

పింక్ సినిమా షూటింగ్‌కు సంబంధించిన న్యూస్ ల కన్నా పవన్ కళ్యాణ్ అసలు షూటింగ్ ఎలా చేస్తున్నాడు అనే దాని మీదే ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు. అందుకే పవన్ ప్రతి మూమెంట్ ని వాచ్ చెయ్యడమే కాదు.. పింక్ రీమేక్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో ఒక వీడియో లీక్ చేసేసారు. ఆ లీకెడ్ వీడియో లో పవన్ కళ్యాణ్ ఓ వ్యక్తితో ఫైట్ చేస్తూ.. నేను నల్లకోటు వేసుకుంటే.. వేసుకోవటానికి పిటీషన్లు, తీసుకోవటానికి బెయిళ్లు ఉండవు అని చెప్పే డైలాగ్ ని వీడియో తో సహా లీకైంది. ఆ వీడియో ని పేస్ బుక్ లో పోస్ట్ కావడం, క్షణాల్లో వైరల్ అవడం జరిగింది. అయితే ఈలోపు చిత్ర బృందం మేలుకుని వెంటనే ఆ వీడియో ని డిలేట్ చేయించారు.

గతంలోనే పవన్ లాయర్ లుక్ బయటికొచ్చినపపుడు పవన్ కళ్యాణ్ నిర్మాతలైన దిల్ రాజు, బోని కపూర్ లను పిలిచి చివాట్లు పెట్టినట్లుగా వార్తలొచ్చాయి. మరి ఓ ఫోటో కే కోపం తెచ్చుకున్న పవన్ ఇప్పుడు వీడియో విషయంలో నిర్మాతలకు ఎలాంటి క్లాస్ పీకబోతున్నాడో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News