కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్.. హుందాగా సమాధానమిచ్చిన మంచు మనోజ్!

ఈ ప్రెస్‌ మీట్‌లో ‘కన్నప్ప’ హార్డ్‌ డిస్క్ మీ దగ్గరే ఉందటగా?

Update: 2025-06-01 08:20 GMT

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, నారా రోహిత్‌, మంచు మనోజ్‌ నటించిన సినిమా ‘భైరవం’. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే30న విడుదలైంది. ఈ చిత్ర యూనిట్ సక్సెస్‌ ప్రెస్‌ మీట్‌ను నిర్వహించింది. ఈ ప్రెస్‌ మీట్‌లో ‘కన్నప్ప’ హార్డ్‌ డిస్క్ మీ దగ్గరే ఉందటగా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మంచు మనోజ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

కన్నప్ప హార్డ్ డ్రైవ్ కు సంబంధించిన ప్రశ్న అడగ్గా “మీకే ఇచ్చాను కదా ఎక్కడుంది?” అని మనోజ్ ఎదురు ప్రశ్నిస్తూ నవ్వేశారు. ఒకప్పుడు సరదాగా ఏదో మాట్లాడాను కానీ, బర్త్ డే తర్వాత అలాంటివి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు. హార్డ్ డిస్క్ విషయంలో మాత్రం తాను మాట్లాడ‌న‌ని అన్నారు. ఒక సినిమా అనేది చాలా మంది కష్టంతో కూడుకున్న‌ది. అందుకే తాను కన్నప్ప సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు హుందాగా తెలిపారు.

Tags:    

Similar News