War 2 Movie : ఎవరూ చేయలేని పనిని నేను చేసి చూపిస్తా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మంచి ఫీస్ట్ లభించింది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 ట్రైలర్ విడుదలయింది.

Update: 2025-07-25 07:24 GMT

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మంచి ఫీస్ట్ లభించింది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 ట్రైలర్ విడుదలయింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. వచ్చే నెల 14వ తేదీన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో నేడు మేకర్స్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. తెలుగు, హిందీ, తమిళంలో ఏకకాలంలో వార్ 2 సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

కొత్త లుక్ లో...
జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. హృతిక్ రోషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ ఇద్దరే. సిక్స్ ప్యాక్ శరీరంతో యూత్ ను ఆకట్టుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఫిజిక్ ను చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ డైలాగ్ నందమూరి అభిమానులకు మంచి కిక్కు ఇచ్చేలా ఉన్నాయి. వార్ 2 సినిమా జూనియర్ సినిమాకు ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. "ఎవరూ చేయలేని పనిని నేను చేసి చూపిస్తా. ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతా" అన్న డైలాగ్ షేక్ చేస్తుంది.
వెరైటీ గా కనిపించే...
హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ వెరైటీగా కనిపించనున్నారు. ఇద్దరి మధ్య జరిగే ఫైటింగ్ సన్నివేశాలు అభిమానులను అలరిస్తాయని అంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. నేడు విడుదలయిన ట్రైలర్ మరింత ఆకట్టుకోవడంతో జూనియర్ కు మరో హిట్టు పడనుందన్న టాక్ చిత్ర పరిశ్రమలో వినపడుతుంది. మరి ఈ మూవీని చూడాలంటే మరో ఇరవై రోజులు ఆగాల్సిందే.



Tags:    

Similar News