జాన్వీకి బంపర్ ఆఫర్..!

Update: 2018-08-10 07:17 GMT

బాలీవుడ్ లో 'ధ‌డ‌క్' మూవీతో తెరంగేట్రం చేసిన శ్రీదేవి కూతురు ఆ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుండగా ఆమెకు అదిరిపోయే ఆఫర్ ఒకటి వచ్చింది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న 3D చిత్రంలో ఈ చిన్నదానికి ఛాన్స్ వచ్చింది. ఈ భారీ ప్రాజెక్ట్ కు 'త‌క్త్‌' అనే టైటిల్ పెట్టి పోస్టర్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్. 'త‌క్త్‌' అంటే సింహాస‌నం అని అర్థం.

స్టార్ల సరసన చాన్స్...

ఈ మెగా ప్రాజెక్ట్ ను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించడం విశేషం. టైటిల్ పోస్టర్ చూస్తుంటే ఇది ఒక హిస్టారిక‌ల్ ఎపిక్ మూవీ అని అర్థ‌మ‌వుతోంది. ఇక రిలీజ్ చేసిన పోస్టర్ లో కాస్టింగ్ చూస్తే ఆశ్చర్యపోయాక తప్పదు. ఈ మధ్యే 'పద్మావతి' సినిమాతో తనలోని మరో నటుడిని మనకు పరిచయం చేసిన ర‌ణ‌వీర్ సింగ్‌ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఇక రణవీర్ తో పాటు క‌రీనాక‌పూర్‌, ఆలియా భ‌ట్‌, భూమి పెడ్నేక‌ర్ వంటి స్టార్లు న‌టిస్తున్నారు. వీళ్లతో పాటు జాన్వీ పేరు క‌నిపించ‌డం పెద్ద స‌ర్‌ప్రైజ్‌.

రెండో సినిమాకే భారీ అవకాశం

ఓ కీల‌క‌పాత్రలో విక్కీ కౌశ‌ల్ నటిచనున్నారు. రెండో సినిమాతోనే ఇంత పెద్ద పెద్ద స్టార్స్ తో నటించే ఛాన్స్ రావడం చూస్తుంటే ఈ అమ్మ‌డి రేంజు ఆ లెవ‌ల్లోకి వెళ్లేట్టే క‌నిపిస్తోంది. 'ధ‌డ‌క్‌' లో తన కొంటె చూపుల‌తో వ‌ల‌పు దోపిడీ చేసిన ఈ అందాల ముద్దుగుమ్మ నెక్ట్స్ లెవ‌ల్ చూపించ‌బోతోంద‌న్న‌మాట‌!! మరి ఈ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుందో ఇంకా క్లారిటీ రాలేదు.

Similar News