కన్నప్ప మూవీ హార్డ్ డ్రైవ్ మిస్సింగ్.. ఇద్దరు వ్యక్తులు తీసుకుని పరారీ

మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‌తో ఇద్దరు వ్యక్తులు పరారయిన ఘటన వెలుగు చూసింది

Update: 2025-05-27 04:34 GMT

మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‌తో ఇద్దరు వ్యక్తులు పరారయిన ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం కన్నప్ప సినిమాకు చెందిన అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను, ఫిల్మ్ నగర్ లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు డీటీడీసీ కొరియర్ ద్వారా ముంబయి హెచ్ఐవీఈ స్టూడియోస్ కు పంపారు.

ఈ నెల 25 తేదీన...
ఆ పార్సిల్ ను ఈ నెల 25వ తేదీన ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని చరిత అనే మహిళకు అందించాడని, అప్పటి నుండి వారిద్దరు కనిపించడంలేదని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ తెలిపింది. కొంతమంది పెద్దవాళ్ళు తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని, వారిద్దరిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ ఫిర్యాదు చేసంది.


Tags:    

Similar News