రేపు విచారణకు రాలేను : దగ్గుబాటి రానా

బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు హీరో రానా దగ్గుబాటి సమయం కోరారు

Update: 2025-07-22 11:51 GMT

బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు హీరో రానా దగ్గుబాటి సమయం కోరారు. బెట్టింగ్స్ యాప్స్ కేసులో ఇప్పటికే రానా దగ్గుబాటితో పాటు మరో ఇరవై మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు రేపు ఈడీ ఎదుట హాజరుకావాలని రానా దగ్గుబాటికి నోటీసుల్లో పేర్కొన్నారు.

షూటింగ్ ఉన్నందున...
అయితే తనకు రేపు షూటింగ్ షెడ్యూల్ ఉన్నందున విచారణకు హాజరుకాలేనని రానా దగ్గుబాటి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విచారణకు వచ్చేందుకు ఈడీని సమయం కోరారు. అయితే రానా దగ్గుబాటి సమాచారంపై ఈడీ అధికారులు స్పందించాల్సి ఉంది. మరో తేదీని విచారణకు రావాల్సిందిగా ఆదేశించే అవకాశముంది.


Tags:    

Similar News