Mukesh Gowda : ‘గుప్పెడంత మనసు’ సీరియల్ 'రిషి' హీరోగా సినిమా..

‘గుప్పెడంత మనసు’ సీరియల్ 'రిషి' హీరోగా పరిచయం అవుతూ ఒక సినిమా తెరకెక్కుతుంది. ‘గీతా శంకరం’ అనే ప్రేమకథతో..

Update: 2023-11-11 05:06 GMT

Mukesh Gowda : తెలుగులో టెలివిజన్ రంగంలో ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' మంచి ప్రజాధారణ పొందుతూ వెళ్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యూత్ ని ఆకట్టుకునే లవ్ స్టోరీ కూడా ఉండడంతో.. మంచి టిఆర్‌పి సాధిస్తూ వస్తుంది. ఇక ఈ సీరియల్ లో హీరోహీరోయిన్లుగా రిషి, వసుధర పాత్రల్లో నటిస్తున్న ముఖేష్ గౌడ్, రక్షా గౌడ్ కి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో వీరికి తెలుగు ఆడియన్స్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది.

ఇక ఈ ఫాలోయింగ్ నటుడు ముఖేష్ గౌడ్‌కి సినిమాల్లో హీరోగా అవకాశం తెచ్చిపెట్టింది. దీపావళి కానుకగా ముకేశ్ తన మొదటి సినిమాని ప్రకటించారు. ‘గీతా శంకరం’ అనే ఒక అందమైన పల్లెటూరి ప్రేమకథతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. మూవీ అండ్ టైటిల్ అనౌన్స్‌మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో ముఖేష్ కి జంటగా ప్రియాంక శర్మ నటిస్తున్నారు.
ఆల్రెడీ ‘గుప్పెడంత మనసు’ సీరియల్ తో లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ముఖేష్.. మొదటి సినిమాని కూడా లవ్ స్టోరీ నేపథ్యంతోనే తీసుకు వస్తుండడం ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. కొత్త దర్శకుడు రుద్ర ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఎస్‌‌ఎస్‌‌ఎంజి ప్రొడక్షన్స్‌ బ్యానర్ లో కె దేవానంద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 14 నుంచి ఈ మూవీ షూటింగ్ ని మొదలు పెట్టబోతున్నట్లు నిర్మాతలు తెలియజేశారు.
ఇక ఈ సినిమా గురించి ముఖేష్ మాట్లాడుతూ.. తనని హీరోగా ఎంపిక చేసుకున్నందుకు దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. లవ్‌ అండ్‌ ఎఫక్షన్‌ తో వస్తున్న ఈ మూవీ యూత్‌కి బాగా నచ్చుతుందని తెలిపారు. అలాగే ఒక నటుడిగా సీరియల్స్ లో మంచి పేరు తెచ్చుకున్నట్లే సినిమాల్లో కూడా ఆ పేరుని సంపాదించుకుంటాను పేర్కొన్నారు. మరి సీరియల్స్ లో సక్సెస్ అయిన ముఖేష్ సినిమాల్లో కూడా విజయం సాధిస్తాడా అనేది చూడాలి.


Tags:    

Similar News