గౌతమ్ మీనన్ కు చివరి నిమిషంలో షాక్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌత‌మ్ మీన‌న్‌ – ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. కానీ చివరి నిమిషంలో [more]

Update: 2019-09-06 08:54 GMT

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌత‌మ్ మీన‌న్‌ – ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. కానీ చివరి నిమిషంలో డైరెక్టర్ గౌతమ్ కి షాక్ తగిలింది. కొంతమంది ఫైనాన్షియర్లు కోర్టు నుంచి సినిమా రిలీజ్ కాకుండా ఉండటానికి స్టే తెచ్చుకున్నారు. మూడేళ్ల ముందు మొద‌లైన ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ గౌతమ్ కి ఫైనాన్షియ‌ర్ల‌తో ఉన్న వివాదాల కార‌ణంగా ఇది విడుద‌ల‌కు నోచుకోలేదు. విక్రమ్ సినిమా ‘ధృవ న‌క్ష‌త్రం’ ప‌రిస్థితీ అంతే. వారితో చర్చకు దిగినా ఫ‌లించ‌లేదు.

రిలీజ్ సమయంలో ఆగింది….

ఈ శుక్రవారం రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఫైనాన్షియ‌ర్లు అడ్డం తిరగడంతో ఆపేసారు. ప్రొడ్యూసర్ గా గౌతమ్ తీసినా కొన్ని సినిమాల ఫ‌లితాలు తేడా రావ‌డం, ఫైనాన్షియ‌ర్ల‌కు బ‌కాయిలు క్లియ‌ర్ చేయ‌క‌పోవ‌డంతో అత‌డి సినిమాలు విడుద‌ల కాకుండా అడ్డం ప‌డుతున్నారు.అవి రిలీజ్ అయితే కానీ గౌతమ్ సమస్యలు తీరవు. కానీ అవి రిలీజ్ అవ్వాలంటే ఫైనాన్షియ‌ర్లు తో సెటిల్ చేసుకోవాలి. ఏమవుతుందో చూద్దాం.

 

Tags:    

Similar News