తెలుగు చలనచిత్ర పరిశ్రమను కుదిపేసిన మాదకద్రవ్యాల కేసులో సీబీఐ దర్యాప్తు ను కోరుతూ సినీ నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ కేసులో ధర్మాసనం గతంలో మాధకద్రవ్యాల వాడకాన్ని అరికట్టేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించి వాటిని అమలుచేయలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు కొంత గడువును ప్రభుత్వ తరపున అదనపు సోలిసిటర్ జనరల్ మనిందర్ సింగ్ కొరారు. ఆ గడువు ముగియడంతో సోమవారం ఈ కేసు తిరిగి విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణకు పిటిషనర్ తరపు నాయవాది శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. వారితో పాటు ఎయిమ్స్ డైరెక్టర్ తరపున నాయ్యవాది దుష్యంత్ పరిషర్ పాల్గొన్నారు. విధివిధానాలను రూపొందించేందుకు మరికొంచెం సమయం కావాలని కోరారు. నాయమూర్తి వారు చెప్పిన వాటిని విన్న తరువాత ఈ కేసును ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు.